అంబేద్కర్ 4వ జాతరను జయప్రదం చేయండి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలుగవ జాతరను జయప్రదం చేయాలని అంబేద్కర్ జాతర మహిళా విభాగం కన్వీనర్ హాజమ్మ పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద పోర్లలో అంబేద్కర్ జాతర గోడపత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.
ప్రజా సంఘాల నాయకులు బహుజనులు మేధావులు, మహిళలు జాతరకు భారీ ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అంబేద్కర్ అందరివాడని మహనీయుని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులుగట్టప్ప,నర్సింలు,హన్మంతు,బాలప్ప, నర్సమ్మ, బాలమ్మ తదితరులుపాల్గొన్నారు.
