ఈనెల 24లోపు స్థానిక సంస్థల ఎన్నికల తేదీ ప్రకటించాలి

ఈనెల 24లోపు స్థానిక సంస్థల ఎన్నికల తేదీ ప్రకటించాలి

హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ లోపు ఎన్నికల తేదీలను ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ, రిజర్వేషన్లపై మాత్రమే స్టే ఇచ్చామని, కానీ ఎన్నికల నిర్వహణపై ఎటువంటి అడ్డంకి లేదని స్పష్టం చేసింది. ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది. దీంతో ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతున్నారో 24వ తేదీలోపు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.