కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ప్ర‌చారం

కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ప్ర‌చారం

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ బీజేపీ అభ్య‌ర్థి లంక‌ల దీప‌క్ రెడ్డి కి మ‌ద్ద‌తుగా కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి జి.కిష‌న్ రెడ్డి (G Kishan Reddy ) ప్ర‌చారం చేశారు. ఈ రోజు యూసఫ్ గుడ డివిజ‌న్‌, శ్రీకృష్ణ నగర్ బి బ్లాక్ , సి బ్లాక్ లో బీజేపీ శ్రేణుల‌తో క‌ల‌సి ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హించారు. త‌మ పార్టీ అభ్య‌ర్థి లంక‌ల దీప‌క్ రెడ్డి ( Lankala Deepak Reddy)ని గెలిపించాల‌ని ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో వివిధ కుల సంఘ నాయకులు, మేధావులను కలిసి బిజెపికి ఓటేయాల్సిందిగా కోరారు.

ప్రచార కార్యక్రమంలో శ్రీకృష్ణ నగర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బుడుగు రవీందర్ ని కలిసి వారి కుల సంఘం మద్దతు ఇవ్వాల్సిందిగా కిషన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జూబ్లీహిల్స్ అసెంబ్లీ బీజేపీ సీనియర్ నాయకులు గంగరాజు, ప్రేమ్, బరిగాల జ్ఞానేశ్వర్, పులి రామ్మోహన్, బడుగు సతీష్, ఫనీల్ కుమార్ , చంద్రమోహన్, ప్రశాంత్, కవిత, కుమారి, స్వప్న, నాగమణి, పవన్, సాయి, బాల్రాజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply