mobilecourt | సాక్షుల బెదిరింపు కేసులో విచారణ ముమ్మరం

mobilecourt | సాక్షుల బెదిరింపు కేసులో విచారణ ముమ్మరం

mobilecourt | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసుకు సంబంధించి సాక్షులను బెదిరించిన ఆరోపణల్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఒకరోజు కస్టడీకి అనుమతిస్తూ కాకినాడ మొబైల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షులను ప్రలోభపెట్టి, తనకు అనుకూలంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేయడమే కాకుండా, చెప్పకపోతే చంపేస్తానని బెదిరించినట్లు అనంతబాబుపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఐఫోన్‌ను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను సేకరించారు.

తాజాగా కోర్టు కస్టడీకి అనుమతించడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టనున్నారు. సాక్షులతో జరిగిన ఫోన్ సంభాషణలు, ఇతర ఆధారాలపై అనంతబాబును ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది.

Leave a Reply