మూగ జీవాలను మింగేసిన మొంథా తుఫాన్..
మూగ జీవాలను మింగేసిన మొంథా తుఫాన్..
జనగామ, ఆంధ్రప్రభ : ఎడతెరిపిలేని మూంథా తుఫాన్‌తో వరదలో కొట్టుకపోయి మూగ జీవాలను మింగేసిందని పంతంగి చంద్రమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జనగామ జిల్లా(Janagama district) నర్మెట మండలం వెల్దండ గ్రామానికి చెందిన పంతంగి చంద్రమౌళికి సంబంధించిన 60 మూగజీవాలు, 50 జీవాలు, కొట్టుకుపోయాయి. నిన్న కురిసిన తుఫాన్ ప్రభావంతో మొత్తంగా 110 మూగ జీవాలను మూంథా తుఫాన్ మింగేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
మొoథా తుఫాన్ లో నిన్న కురిసిన వర్షాల వల్ల గొర్రెలు చనిపోవడంతో గొర్రెల యజమానిని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం(GMPS) జిల్లా బృందం పరామర్శించింది. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు మోటే దేవేందర్ గారు మాట్లాడుతూ.. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మొoథా తుపాన్ కారణంగా గొర్రెలను మేత కోసం తోలుకపోయి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో చెరువులకు పోయే కాలువ ఉదృతం అయ్యింది.
గొర్రెల కాపరులు గమనించకపోవడంతో గొర్రెలను దారివెంట వస్తున్న క్రమంలో అవి వరదలో కొట్టుకపోయాయి. జిల్లా వ్యాప్తంగా అనేక గొర్రెలు, మేకలు చనిపోయాయి. గొర్రెలు, మేకల(sheep and goats)కు ఒక్కదానికి 10 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. మొత్తం 110 గొర్రెలు చనిపోవడం వలన రెండు కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం ఇప్పటీకైనా.. స్పందించి గొర్రెలకు మేకలకు ఇన్సూరెన్స్ పథకం(Insurance Scheme ) పెట్టి ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెలకు నష్టపరిహారం ఇప్పించాలన్నారు. గొర్రెలను కాసుకుంటూ ప్రమాదవశాత్తు పాముకాటుకు లేక తేలుకాటుకు లేదా పిడుగులు పడి చనిపోయిన గొర్రెల కాపరుల కుటుంబానికి పది లక్షల ఎక్స్ గ్రేసీయా(ex gratia) ఇవ్వాలన్నారు.
గొర్రెల కాపర్ల కుటుంబాలకు వెంటనే తిరిగి గొర్రెలను ప్రభుత్వమే కొనివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం జిల్లా సహాయ కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు, మండల అధ్యక్షులు వేల్పుల రాజు, కార్యదర్శి పులిగిల్ల రాజు(Puligilla Raju), గ్రామ సోసైటీ అధ్యక్షులు శ్రీపతి కుమార్, సీవంగుల రాజు, స్వామి, దేవుని సీద్దయ్య దోడకాయల రాజు, శ్రీపతి నరేంద్రర్, పంతంగి రమేష్, పంతంగి మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.
