అభివృద్ధిలో జిల్లాను ప్రథమ స్థానం నిలుపుదాం

అభివృద్ధిలో జిల్లాను ప్రథమ స్థానం నిలుపుదాం
కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : జిల్లా నాలుగొవ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ దిశా కమిటీ వైస్ చైర్మన్ మొదటి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్లో నిర్వహించారు. దిశా చైర్మన్, లోక్ సభ ప్యానల్ స్పీకర్ బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. జిల్లా ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, గుంటూరు జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతి బసు, ప్రకాశం జిల్లా జడ్పీ సీఈవో, డ్వామా, గృహ నిర్మాణ సంస్థ, ఎస్ఈ పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, వ్యవసాయ, హాండ్ లూమ్స్ , టెక్స్టైల్స్, వైద్య ఆరోగ్య, నైపుణ్య అభివృద్ధి సంస్థతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, జల్ జీవన్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, బేటీ బచావో.. బేటీ పడావో, సమగ్ర శిక్ష, స్వచ్ఛభారత్ మిషన్ కింద ప్రాజెక్టుల పురోగతి పై ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా జిల్లాలో వెనుక బడిన గ్రామాలు అన్నిశాఖ అధికారులు తదుపరి సమావేశంలో నివేదిక సమర్పించాలని దిశా చైర్మన్ ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ4 విధానం అమలులో బాపట్ల జిల్లాను ప్రథమంగా ఎంచుకున్నట్లు ఎంపీ తేనేటి వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్యంతో పనిచేయాలని పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అభివృద్ధిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
