రైస్ మిల్లు గోడ కూలి.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

రైస్ మిల్లు గోడ కూలి.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

కోటగిరి, ఆంధ్రప్రభ : మండ‌ల కేంద్ర‌మైన మాలివాడలో పాడు బడ్డ ఓ రైస్ మిల్లు (Rice Mill) గోడ కూలి ఇంటిపై పడడంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న యువకుడుతోపాటు రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మాలివాడకు చెందిన ఇందూరు మహేష్ (25) భార్య మహేశ్వరి తమ కూతురు రెండు నెలల చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ రోజు ఉదయం సుమారు ఆరు గంటల సమయంలో వారి ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ రైస్ గోడ ఒక్కసారిగా కూలి పక్కనే ఉన్న ఇల్లు రేకులపై ప‌డింది.

అందులో నిద్రిస్తున్న ఇందూర్ మహేష్ (Indore Mahesh), రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా స్థానికులు గమనించి వెంటనే ఆ మట్టిని తొలగించడంతో మహేశ్వరి గాయాలతో బయటపడింది. గాయ‌ప‌డిన‌ ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాలని స్థానికులు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా పాడుబడ్డ రైస్ మిల్లు శిథిలావస్థకు చేరినప్పటికీ పట్టించు కోకపోవడం వ‌ల్ల‌ ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లు యాజమాన్యం (Rice mill ownership) పై చర్యలు తీసుకొని మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.