వారం రోజుల్లో ఛేదించిన పోలీసులు

44 మంది అరెస్టు

గోదావరిఖని, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్‌బీఐ(SBI)లో జరిగిన 12.61 కోట్ల విలువగల బంగారం చోరీ కేసులో 44 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘ‌ట‌న జ‌రిగిన వారం రోజుల్లో కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి 15.237 కిలోల బంగారం, రూ .1,61,730 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నార‌ని రామగుండం(Ramagundam) పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌(Amber Kishore) వెల్లడించారు.

ఈ కేసులో 44 మంది నిందితులను అరెస్టు చేయగా 13 మందిని రిమాండ్ చేసినట్లు తెలిపారు. చెన్నూరు ఎస్‌బీఐ బ్యాంకు(Chennur SBI Bank)లో చోరీ జ‌రిగ‌న సంఘ‌ట‌న‌పై ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా(Ritesh Kumar Gupta) చెన్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులలో ఎస్‌బీఐ బ్రాంచ్ క్యాషియర్ (SBI Branch Cashier) నరిగె రవీందర్, బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌లతోపాటు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల మేనేజర్లు, సిబ్బంది, స్థానికులు ఉన్నారు. విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్, సీఐలు దేవేంద‌ర్ రావు తదితరులు ఉన్నారు.

Leave a Reply