గద్దర్ వర్ధంతి… ఘన నివాళులు
గద్దర్ ఆశయాలు మరువలేనివి: సర్పంచ్ చరణ్ గౌడ్
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: ప్రముఖ ప్రజాకవి, గాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, “ప్రజా యుద్ధ నౌక”గా పేరొందిన గద్దర్ వర్ధంతి సందర్భంగా గురువారం భీమ్‌గల్ మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో గ్రామ సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని గద్దర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ చరణ్ గౌడ్ మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల కోసం గద్దర్ చేసిన పోరాటం, ప్రజా చైతన్యానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. గద్దర్ తన పాటలు, సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపారని, సామాజిక మార్పు కోసం నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని, వాటిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు.
గద్దర్ పాటలు ప్రజల్లో చైతన్యాన్ని నింపాయని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. ప్రజల హక్కుల సాధన కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బోజా గౌడ్, ఖాజా మొహినుద్దీన్, కిరణ్, శ్రీనివాస్, మహేష్, శేఖర్, భూమేశ్వర్, రాజేష్, వెంకటేష్ తదితరులు పాల్గొని గద్దర్‌కు ఘన నివాళులు అర్పించారు.
చివరగా “జోహార్ గద్దరన్నా!” అంటూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
