Rudrur | పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక…
Rudrur | పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక…
Rudrur | రుద్రూర్, ఆంధ్రప్రభ : ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిసాము.. చదువుల చెట్టు నీడలో అంటూ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక 1989-1990 బ్యాచ్ కు చెందిన 25 మంది పూర్వ విద్యార్థులు ఇందూర్ సునీత చంద్రశేఖర్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. తమ బ్యాచ్ కు చెందిన ఇందూర్ చంద్ర శేఖర్ రెండుసార్లు రుద్రూర్ సర్పంచ్ గా పని చేసి తిరిగి అదే కుటుంబానికి చెందిన చంద్ర శేఖర్ సతీమణి ఇందూర్ సునీత భారీ మెజార్టీ ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో పాటు మెంబర్లు కూడా ఎక్కువ సంఖ్యలో గెలుచుకొని ఉపసర్పంచ్ చేజిక్కించుకున్నారు. ఒకే కుటుంబంలో మెజార్టీ మండల్ లో అధికార పార్టీ ని ఓడించి సర్పంచ్ హ్యాట్రిక్ సాధించడం గొప్ప విశేషమని పూర్వ విద్యార్థులు కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎన్నిక కావడం చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి. సర్పంచ్ దంపతులను శాలువాతో సన్మానించి స్వీట్లు పంచి పెడుతూ నూతనంగా గెలుపొందిన సర్పంచ్ ను గజమాలతో సత్కరించారు. అనంతరం ఒక్కరినొకరిని పరిచయం చేసుకొని ఆ లింగనం చేసుకొని నిక్ నేమ్ తో పీల్చుకున్నారు. తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని వారి యోగక్షమా లను గుర్తు చేసుకున్నారు. మంచికి మారుపేరు చంద్రశేఖర్ సేవలను గుర్తించి ప్రజలు బ్రహ్మరథం పట్టారనిపట్టారని పూర్వ విద్యార్థులు అభినందించారు. తమ బ్యాచుకు చంద్రశేఖర్ గర్వకారణం అని వారు పేర్కొన్నారు. అలాగే అందరూ కలిసికట్టుగా గెట్ టు గెదర్ నిర్వహించుకున్నారు. పూర్వ విద్యార్థులు ముద్దసాని రాజు, బుద్దే సాయిలు, పుట్టి భూమయ్య, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
