Sensex | ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్లు…
సెన్సెక్స్ జోరు.. నిఫ్టీ స్వల్ప నష్టం
Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమ ధోరణితో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల సూచీలు పెద్దగా ఊగిసలాట లేకుండా కదులుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్లు కొనసాగుతుండగా.. మరికొన్ని రంగాల్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది.
ఉదయం ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 394 పాయింట్లు లాభపడి 78,822 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 13 పాయింట్లు స్వల్ప నష్టంతో 24,629 వద్ద కొనసాగుతోంది. దీంతో మార్కెట్లు ఫ్లాట్ ట్రెండ్‌లో కదులుతున్నట్లు కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే.. అమెరికా డాలర్ ఇండెక్స్ 99.78 వద్ద కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 78.4 డాలర్లకు చేరగా, అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.6 శాతానికి నమోదైంది.
అమెరికా మార్కెట్లలో గత ట్రేడింగ్ సెషన్ సానుకూలంగా ముగిసింది. ఎస్ అండ్ పీ-500 సూచీ 1.79 శాతం లాభపడగా, టెక్నాలజీ షేర్లకు ప్రాధాన్యం ఉన్న నాస్‌డాక్ సూచీ 2.59 శాతం ఎగసింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా కనిపిస్తున్నప్పటికీ, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో సూచీలు మిశ్రమంగా కదులుతున్నాయి.
