సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
వినుకొండ, ఆంధ్రప్రభ: పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ అంజనేయులు 60 మంది లబ్ధిదారులకు రూ.36,91,588లు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య చికిత్స భారంగా మారకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా వేగవంతంగా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. పేద ప్రజలకు అత్యవసర వైద్య చికిత్స అందేలా ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తోందని తెలిపారు.
వినుకొండ నియోజక వర్గంలో ఇప్పటి వరకు మొత్తం 2,038 మంది లబ్ధిదారులకు రూ.13,76,07,152 సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరైందని, ఒక్కరోజులోనే 60 మందికి రూ.36.91 లక్షల విలువైన చెక్కులు అందజేయడం ప్రజా ప్రభుత్వ సంక్షేమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి సందర్భంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
