యువత ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చెయ్యాలి..

నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ ఎలమంచిలి శివాజీ

గుంటూరు, ఆంధ్రప్రభ : యువత ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలని రైతు నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ ఎలమంచిలి శివాజీ అన్నారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, సమాజ శ్రేయస్సు, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యాలుగా ముందుకు సాగాలని సూచించారు.
శివాజీ జన్మదినం సందర్బంగా మాజీ డీజీపీ మాలకొండయ్య, మాజీ అడిషనల్ ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని అయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దేశంలో ఎమర్జెన్సీ కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు, విద్యార్థి, రైతు ఉద్యమాల గురించి వారు చర్చించారు. గత తరం రాజకీయ నాయకుల స్ఫూర్తితో యువత ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని ఈ సందర్బంగా యలమంచిలి అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పించి, వారు సన్మార్గంలో పయనించేలా ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టాలని కోరారు.