విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికి ఎంపీ కేశినేని విశేష సేవలు
పాయకాపురం, ఆంధ్రప్రభ: విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) జన్మదిన వేడుకలను సింగ్నగర్లో ఘనంగా నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సింగ్నగర్లోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత సమర్థవంతంగా సేవలందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఘంటా కృష్ణమోహన్, కె. రవికుమార్, దాసరి కనకారావు, పరుచూరి ప్రసాద్, నవణితం, జలకం రాజారావు, పైడి శ్రీను తులసి, ఆకుల సూర్యప్రకాష్, ఎస్.కె. గౌస్ బాషా, ఎస్.కె. గౌసియా తదితరులు పాల్గొన్నారు.
