హసకొత్తూరులో మహిళల పరిరక్షణపై గ్రామసభ

మహిళల భద్రత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో మహిళల పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. గ్రామంలో మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

వర్షాకాలంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఇంటి వద్ద కనీసం రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

అనంతరం మహిళల అభ్యున్నతి, సాధికారత, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి నర్సయ్య, వార్డు సభ్యులు కుందేటి శ్రీనివాస్, కల్లెడ రాణి, కాశవ్వ, జుంబరాత్ అశోక్, హరీష్, సుజాత, మమత, ఆశా కార్యకర్తలు లావణ్య, హేమలత, అంగన్‌వాడీ కార్యకర్తలు అనిత, సాయమ్మ, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.