బిక్కనూర్ పట్టణ అభివృద్ధికి సహకారం

బిక్కనూర్ పట్టణ అభివృద్ధికి సహకారం

కేజేఎల్ పౌల్ట్రీస్ ఫౌండేషన్ ఎండీ డాక్టర్ శ్రీనివాసరాజు

బిక్కనూర్, జూన్ 17 (ఆంధ్రప్రభ): బిక్కనూర్ పట్టణ అభివృద్ధికి తమవంతు పూర్తి సహకారం అందిస్తామని కేజేఎల్ పౌల్ట్రీస్ ఇండస్ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరాజు తెలిపారు. బుధవారం పరిశ్రమల సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా రూ.10 లక్షల విలువైన చెత్త తరలింపు వాహనాన్ని కేజేఎల్ పౌల్ట్రీస్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీకి అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో తాము భాగస్వాములుగా ఉంటామని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు పట్టణాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం గ్రామ సర్పంచ్ బల్యాల రేఖా సుదర్శన్ మాట్లాడుతూ, బిక్కనూర్ అభివృద్ధికి కేజేఎల్ పౌల్ట్రీస్ సంస్థ అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరాజును శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, సచివాలయ కార్యదర్శి మహేష్ గౌడ్, సిద్ధిరామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.