AP | ఆరు జిల్లాలకు కొత్త డీఈవోలు..

ప్రభుత్వం ఉత్తర్వులు


AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖలో కీలక నియామకాలు చేపట్టింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు కొత్త జిల్లా విద్యాశాఖ అధికారులను (డీఈవోలు) నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ నిర్ణయం మేరకు అనంతపురం జిల్లా డీఈవోగా ఆయిబ్ హుస్సేన్, అల్లూరి సీతారామరాజు జిల్లా డీఈవోగా భానుమూర్తిరాజు, ప్రకాశం జిల్లా డీఈవోగా సీవీ రేణుక, పశ్చిమ గోదావరి జిల్లా డీఈవోగా అనిల్‌కుమార్, కోనసీమ జిల్లా డీఈవోగా మహబూబ్‌బాషా, అనకాపల్లి జిల్లా డీఈవోగా నాగేశ్వరరావులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ కాగా, కొత్తగా నియమితులైన అధికారులు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.