KCR | పెద్దగుండవెల్లిలో విషాదఛాయలు

KCR | పెద్దగుండవెల్లిలో విషాదఛాయలు
KCR | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిన్ననాటి గురువు నక్కల పున్నారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
నక్కల పున్నారెడ్డి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పున్నారెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించేందుకు బంధువులు, ఆత్మీయులు, స్థానిక ప్రజలు పెద్దగుండవెల్లికి తరలివస్తున్నారు. పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
