Sensex | 245పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్…

Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, ఐటీతో పాటు పలు రంగాల్లో కొనుగోళ్ల ఆసక్తి పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీ గ్రీన్‌లో కొనసాగుతున్నాయి.

ఉదయం ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 24,141 వద్ద కొనసాగుతోంది. మరోవైపు బీఎస్‌ఈ సెన్సెక్స్ 245 పాయింట్లు లాభపడి 77,426 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే.. అమెరికా డాలర్ ఇండెక్స్ 100.53 వద్ద కొనసాగుతోంది. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర 84.5 డాలర్ల వద్ద ఉండగా, అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.5 శాతానికి చేరాయి.

అమెరికా మార్కెట్లు గత సెషన్‌లో సానుకూలంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.38 శాతం, నాస్‌డాక్ 0.62 శాతం లాభపడటంతో ఆసియా మార్కెట్లపై కూడా అనుకూల ప్రభావం కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్ల కదలికలు, ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణి, డాలర్ సూచీ తదితర అంశాలు గురువారం దేశీయ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.