వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం
మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్‌లో రాముని చెరువు వద్ద సోమవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
