Nirmal నిర్మల్‌కు విచ్చేసిన డీజీపీ సి.వి. ఆనంద్‌కు ఘన స్వాగతం
Nirmal నిర్మల్‌కు విచ్చేసిన డీజీపీ సి.వి. ఆనంద్‌కు ఘన స్వాగతం
- పూలమొక్క అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ ( Nirmal) , ఆంధ్రప్రభ:
జిల్లా కేంద్రానికి బుధవారం సాయంత్రం విచ్చేసిన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్‌కు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆత్మీయ స్వాగతం పలికారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో డీజీపీకి పూలమొక్క అందజేసి స్వాగతించిన కలెక్టర్, అనంతరం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జానకి షర్మిలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు పరిపాలనా, శాంతిభద్రతల అంశాలపై డీజీపీ సి.వి. ఆనంద్‌తో సమావేశమై చర్చించారు. జిల్లాలో అమలవుతున్న పరిపాలనా కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై ఆయనకు వివరించినట్లు సమాచారం.
