6వ వార్డులో విద్యుత్ సమస్యకు పరిష్కారం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి 6వ వార్డు ఇంక్లైన్ బస్తీలో లో-వోల్టేజీ, తరచూ ట్రిప్పింగ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి, విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. రాత్రి కరెంట్ నిలిచిపోవడంతో లైన్‌మెన్ ద్వారా తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. అనంతరం ఏఈ మల్లేశం కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసి ఏర్పాటు చేయించారు. రెండు ట్రాన్స్‌ఫార్మర్లకు కనెక్షన్లు విభజించడంతో విద్యుత్ సమస్య పూర్తిగా తొలగింది. దీనిపై బస్తీ ప్రజలు కౌన్సిలర్, విద్యుత్ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply