Tension Tension | ఉరవకొండలో ఉద్రిక్తత…
మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు
పోలీసులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తోపులాట
Tension Tension | ఉరవకొండ రూరల్, ఆగస్టు 3 (ఆంధ్రప్రభ): తెలుగుదేశం పార్టీ పాలనలో ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. సోమవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా మందస్తుగా పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డిని అరెస్టు చేశారు.

ధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో, ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటూ, పోలీస్ వాహనాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అక్రమ అరెస్టులకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. వై.విశ్వేశ్వర రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ను అరెస్టు చేశారు.
