బీసీలను కరేపాకుల వాడుకుంటున్న కూటమి ప్రభుత్వం…

బీసీలను కరేపాకుల వాడుకుంటున్న కూటమి ప్రభుత్వం…

కూటమి ప్రభుత్వంలో బీసీలపై చిన్నచూపు..
ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ప్రభుత్వం..
అందుకే 26న బీసీల గర్జనకు తరలిరండి..
ఇంచార్జ్ దీపికమ్మ నియోజవర్గ అధ్యక్షులు మానేంపల్లి రామాంజనేయులు పిలుపు

హిందూపురం, ఆంధ్రప్రభ : బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని బీసీలకు ఏమాత్రం కూడా ఇచ్చిన హామీల్లో నెరవేర్చిన దాఖలాలు లేవని అందుకోసమే జగనన్న రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి బీసీ గళం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తరలిరావాలని విజయవంతం చేయాలని బిసి నియోజకవర్గ అధ్యక్షులు రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగ స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ దీపికమ్మ ఆదేశాలతో పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. పోస్టర్లను ఆమె చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దీపికమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అబద్ధాల మాటలతో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు గతంలో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా గాలికి వదిలేసారు అన్నారు. జగనన్న ప్రభుత్వంలో బీసీలందరికీ ఎనలేని ప్రాధాన్యత కల్పించడం జరిగింది అన్నారు. రాజకీయంగా 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్న విషయాన్ని ఆయన తెలిపారు. బీసీలకు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రస్తుతం బీసీలపై దాడులు అదేవిధంగా అన్ని విధాలుగా కూడా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కాబట్టి బీసీలకు దక్కాల్సిన హక్కులన్నీ పొందేందుకు ప్రతి ఒక్కరు తరలిరావాలని 26వ తేదీ బీసీ గలం పేరుతో అనంతపురంలోనీ సప్తగిరి సర్కిల్ లలిత కళాపరిషత్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అదేవిధంగా రామాంజనేయులు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా బీసీలందరూ తరలిరావాలని జగనన్నకు బీసీలు అంటే ఎనలేని అభిమానం అన్నారు. అందుకే ఆయన బీసీలకు ఆయన ప్రభుత్వంలో పెద్దపీట వేయడం జరిగిందన్నారు. కాబట్టి బీసీల హక్కుల సాధించుకోవడం కోసం ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా తరలి రావాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకుడు శ్రీకాంత్ గౌడ్ , కో కన్వీనర్ కొల్లప, నాగేంద్ర , అశ్వత్ నారాయణ, నరసింహమూర్తి, జుమ్మాకులపల్లి ఉగ్రప్ప, ప్రభాకర్ గౌడ్ , శ్రీనాథ్ , గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply