పీఏసీఎస్ డైరెక్టర్ మోహన్ రెడ్డికి పూర్వ విద్యార్థుల ఘన సన్మానం

1979-80 బ్యాచ్ స్నేహితుల ఆత్మీయ అభినందనలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ఆదర్శ రైతు మోర్తల మోహన్ రెడ్డిని స్థానిక జడ్పీ హైస్కూల్ 1979-80 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. దినేష్ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

ఇటీవల ఆలేరు పీఏసీఎస్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, పదో తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితులు ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతాంగం, ప్రజాసేవలో ఎన్నో దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మోహన్ రెడ్డి తనను ఘనంగా సన్మానించిన పూర్వ విద్యార్థి మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.