మండలి వెంకట కృష్ణారావు చిత్రపటాల బహుకరణ..

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మండలి వెంకట కృష్ణారావు జయంతి అధికారికంగా నిర్వహించ తలపెట్టిన సందర్భంగా కూటమి నాయకులు ప్రభుత్వ కార్యాలయాలకు కృష్ణారావు చిత్రపటాలను బహుకరించారు. అవనిగడ్డ టీడీపీ క్లస్టర్ ఇంచార్జి బండే రాఘవ – మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ దంపతులు నలభై చిత్రపటాలు సిద్ధం చేశారు. సోమవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం నలభై చిత్రపటాలను అవనిగడ్డ మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందచేశారు.

మోపిదేవి మండల జనసేన పార్టీ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ మెరకనపల్లి నరేష్ మోపిదేవి మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాలు, పెదకళ్ళేపల్లి గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసేందుకు ఇరవై చిత్రపటాలను సిద్ధం చేసి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వాటిని మోపిదేవి మండలంలోని కార్యాలయాలకు, పాఠశాలలకు బహుకరించారు. కార్యక్రమంలో గాంధీ క్షేత్రం కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, కూటమి నాయకులు కమ్మిలి సుబ్రహ్మణ్యం, కోసూరు రవి, యలవర్తి చిన్నా, గుడివాక శివరావు, గరికపాటి హరిప్రసాద్, కమతం నరేష్, బచ్చు శ్రీహరి, నాగిడి బాబూరావు, గరికపాటి హరిబాబు, మండలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.