ఘనంగా యర్రంరెడ్డి వేణుగోపాల్ రెడ్డి వర్ధంతి వేడుకలు..

ఘనంగా యర్రంరెడ్డి వేణుగోపాల్ రెడ్డి వర్ధంతి వేడుకలు..

హనుమాన్‌పేటలో టీడీపీ నేతల శ్రద్ధాంజలి
గన్నే ప్రసాద్ ఆధ్వర్యంలో నివాళులు

విజయవాడ, ఆంధ్రప్రభ : స్వర్గీయ యర్రంరెడ్డి వేణుగోపాల్ రెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా హనుమాన్‌పేటలోని టీడీపీ రాష్ట్ర నాయకులు గన్నే ప్రసాద్ (అన్నా) కార్యాలయంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నే ప్రసాద్ (అన్నా) పార్టీ నాయకులతో కలిసి వేణుగోపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ఆయన సేవలను స్మరించుకుంటూ, పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావం, నాయకత్వం నేటి తరానికి మార్గదర్శకమని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply