ఘంటసాల గ్రంథాలయానికి ఆధ్యాత్మిక, చారిత్రక గ్రంథాల విరాళం
ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాలలో ఉన్న జిల్లా గ్రంథాలయ బ్రాంచ్ కార్యాలయానికి అవనిగడ్డకు చెందిన సీనియర్ పాత్రికేయులు, ఆధ్యాత్మిక గురువు తుర్లపాటి రామ మోహన్ రావు రామాయణ, మహాభారత, భాగవత పురాణాలతో పాటు పలు అధ్యాత్మిక గ్రంథాలను లైబ్రేరియన్ శరత్ కు సోమవారం అందచేశారు. రాజకీయ, సాంఘిక, అయ్యప్ప చరిత్ర, చరిత్రాత్మిక గ్రంథాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్, గ్రామ ప్రముఖులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, వేకనూరుకు చెందిన చామర్తి పురుషోత్తం రావు పాల్గొన్నారు. తమ గ్రామ గ్రంథాలయానికి పలు పుస్తకాలను అందించిన తుర్లపాటి గొర్రెపాటి అభినందించారు.
