అట్టహాసంగా ఎంపి చిన్ని జన్మదిన వేడుకలు..
- పండుగ వాతావరణంలో..
- పెద్ద ఎత్తున నిర్వహించిన టిడిపి శ్రేణులు..
( భవానిపురం, ఆంధ్రప్రభ ) : విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం లోని బుద్ధ వెంకన్న కార్యాలయంలో సోమవారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అట్టహాసంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలకు పెద్ద ఎత్తున అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరై సందడి చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు పాల్గొని ఎంపీ చిన్ని దీర్ఘాయుష్షు, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
