గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూత
ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలానికి చెందిన షేక్ బాషా (50) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు.
ఈ నెల 29న సాయంత్రం సాటాపూర్ గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో షేక్ బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున 12:30 గంటలకు ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి భార్య వాజిదా బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ముత్యాల రమ వెల్లడించారు.
