కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి..

కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి..
- ఈనెల 24,25 తేదీల్లో కామారెడ్డిలో ప్రథమ మహాసభ
- ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు పార్వతి రాజేశ్వర్
రెంజల్, ఆంధ్రప్రభ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు పార్వతి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పై విధంగా స్పందించారు.
ఈ సందర్భంగా పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ…దేశంలో 14 కోట్ల వ్యవసాయ కూలీలు ఉన్నారని, అందులో 60 లక్షల మంది స్వరాష్ట్రం వారే అధిక సంఖ్యలో మహిళా కూలీల పరిస్థితి దయనీయంగా,వ్యవసాయ కూలీల సొంత భూమి లేకపోవడం చేత దినసరి కూలీలుగా పనిచేస్తున్నారని అన్నారు.
వీరికి ఏడాదికి 60 దినాలు మాత్రమే పని దొరుకుతుందని,వ్యవసాయ కూలీలకు ఆదాయం అతి తక్కువ కాబట్టి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన చట్టాన్ని తెచ్చిన అమలు కావడం లేదన్నారు.వ్యవసాయ కూలీలు బతకాలంటే కనీసం నెలకు రూ.26 వేల వేతన చట్టాన్ని అమలుపరచాలని పార్వతి రాజేశ్వర్ సూచించారు.
వ్యవసాయ రంగంలో పని దొరకదని,ఆదాయం లోటును ప్రభుత్వమే భరించాలన్నారు. కూలీలకు ఏడాదికి రూ.12,000 చొప్పున ఇస్తామని ప్రకటించి నేటికీ ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాంజీ రామ్ ఉపాధి హామీ పథకాన్ని రూపుమాపి,ఉపాధి కూలీలకు రోజుకు రూ.6 వందల ఇస్తామని చెప్పి,ప్రస్తుతం రోజురోజుకు నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.
చలో కామారెడ్డి ఈనెల 24,25 తేదీల్లో తరలి రావాలి…
పైన తెలిపిన సమస్యలపై ఈ నెల 24,25 తేదీల్లో కామారెడ్డి పట్టణంలో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభలకు తరలిరావాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సభ్యుడు పార్వతి రాజేశ్వర్ పిలుపునిచ్చారు.
మహాసభలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగారావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా నిజామాబాద్,కామారెడ్డి సంయుక్త కార్యదర్శి వి.ప్రభాకర్ విచ్చేయుచున్నారు. విలేకరుల సమావేశంలో అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర నాయకుడు పుట్టి నడిపి నాగన్న,నాయకులు మిద్దె పెద్దలు,మన్నె పోశెట్టి,జబ్బర్,సిద్ధ పోశెట్టి,అమిత్,గంగాధర్, దేవరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
