బక్రీద్ పండుగ ఏర్పాట్ల పరిశీలన..

బక్రీద్ పండుగ ఏర్పాట్ల పరిశీలన..

ఈద్గా వద్ద సౌకర్యాలపై అధికారుల దృష్టి

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: గురువారం జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా భీమ్‌గల్ పట్టణంలోని బాపుజీ నగర్‌లో ఉన్న ఈద్గా స్థలంలో ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

ఈద్గా వద్ద మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి (స్వామి), వైస్ చైర్‌పర్సన్ సంటి లత, స్థానిక కౌన్సిలర్‌తో కలిసి మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ తరఫున టెంట్లు, మ్యాట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం, సౌండ్ సిస్టం వంటి ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు జేజే నర్యయ్య, అంజు ఆలీ, నీలం రవి, ముస్లిం మత పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.