ఘనంగా ఎంపీ చిన్ని జన్మదిన వేడుకలు..
- సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు కార్యకర్తలు..
- వేడుకలు నిర్వహించిన టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్
- సాయిబాబా ఆలయం, గుణదల మేరీమాత చర్చిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు
- అభాగ్యులకు అన్నదానంతో జన్మదిన వేడుకలకు సేవా స్పూర్తి
- విజయవాడ పార్లమెంట్ ప్రజల మనసులు గెలుచుకున్న నాయకుడిగా ఎంపీ చిన్ని: పరుచూరి ప్రసాద్
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) జన్మదిన వేడుకలు సోమవారం విజయవాడలో సేవా కార్యక్రమాల నడుమ ఘనంగా నిర్వహించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, అన్నదానం నిర్వహించి ఎంపీ చిన్ని ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి కేశినేని చిన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి విశ్వాసాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు.

ప్రజల ఆదరణతోనే ఆయన అత్యధిక మెజార్టీతో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారని అన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని ముత్యాలంపాడులోని షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గుణదల మేరీమాత ఆలయంలో చర్చి ఫాదర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పలు ప్రాంతాల్లో అభాగ్యులకు అన్నదానం చేపట్టి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తూ విజయవాడ నగరంతో పాటు తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల అభివృద్ధికి ఎంపీ కేశినేని చిన్ని విశేష కృషి చేస్తున్నారని పరుచూరి ప్రసాద్ కొనియాడారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దాసరి కనకరావు, బుద్దవరపు రాజా, ఎస్. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
