రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు

ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం

మేడ్చల్–మల్కాజిగిరి, ఆంధ్రప్రభ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కీసర రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోమవారం దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో ఆయనను ఆహ్వానించారు.

అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని బీర్ల అయిలయ్య ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు బీర్ల అయిలయ్యకు వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ విశేషాలను అధికారులు ఆయనకు వివరించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.