పట్నం కుటుంబానికి పరామర్శ
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తల్లి రుక్కమ్మ చిత్రపటానికి కేటీఆర్ నివాళి
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
చేవెళ్ల, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తల్లి రుక్కమ్మ దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్నం నరేందర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి తన అండ ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని రుక్కమ్మకు నివాళులర్పించారు.

