Avanigadda : శాకాంబరీ అలంకారంలో..

Avanigadda : శాకాంబరీ అలంకారంలో..

  • అవనిగడ్డ లంకమ్మ తల్లి
  • మాచవరం తుంగపల్లెమ్మకు విశేష పూజలు!

(అవనిగడ్డ – ఆంధ్రప్రభ)

దివిసీమలోని ప్రముఖ క్షేత్రాలైన అవనిగడ్డ శ్రీ లంకమ్మ తల్లి దేవాలయంలో , మాచవరం శ్రీ తుంగపల్లెమ్మ తల్లి ఆలయంలో అమ్మవార్లు ఈరోజు భక్తులకు శాకాంబరీ దేవి అలంకారంలో నయన మనోహరంగా దర్శనమిచ్చారు. లోకకళ్యాణార్థం, పంటలు బాగా పండి ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.


ఈ సందర్భంగా అమ్మవార్లను వివిధ రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు రంగురంగుల పూలతో దివ్యంగా అలంకరించారు. అవనిగడ్డ లంకమ్మ తల్లి, మాచవరం తుంగపల్లి అమ్మ తల్లి ఆలయాల్లో ఉదయం నుంచే అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, విశేష అర్చనలు జరిపారు.