అమ్మవారి వేద పరిరక్షణ కు విరాళం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి వేద పరిరక్షణ ట్రస్ట్‌కు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని సిరి లింగంపల్లికి చెందిన పలగుమ్మి అఖిల్ విశ్వేశ్, కుటుంబ సభ్యులు రూ.1,15,000 విరాళాన్ని సమర్పించారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న అనంతరం వేద పరిరక్షణ, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు తమ వంతు సహాయంగా ఈ విరాళాన్ని అందజేశారు. ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్, ఆలయ అర్చక స్వాముల సమక్షంలో భక్తిపూర్వకంగా విరాళాన్ని సమర్పించారు. దాతకు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును అందజేశారు.
