Kodur | అభివృద్ధే మా ధ్యేయం

Kodur | కోడూరు, ఆంధ్రప్రభ : రహదారుల అభివృద్ధే.. మా ధ్యేయమని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. కోడూరు మండలం ఊటగుండంలో ప్రధాన రహదారికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇరాలి, రామకృష్ణాపురం, ఊటగుండం గ్రామాలకు రహదారి ద్వారా ప్రయోజనం కలుగుతుందన్నారు. నాబార్డ్ నిధులు రెండు కోట్ల నలభై లక్షలతో కోడూరు కోటగుండం ప్రధాన రహదారిలో 4/4 కిలోమీటర్ల నుంచి 40/7 కిలోమీటర్ల వరకు దాదాపు పది కిలోమీటర్ల మేరకు నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పీసీ చైర్మన్ వెంకటేశ్వరరావు, కోడూరు పిఎసిఎస్ అధ్యక్షులు పూతబోయిన కరుణ కుమార్, గ్రామపంచాయతీ గ్రామ సర్పంచ్ దేవనబోయిన కనకదుర్గ, వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
