ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు జన్మదినం.. రక్తదాన శిబిరం
బ్రహ్మాజీవాడి కాంగ్రెస్ నాయకుల రక్తదానం
తాడ్వాయి, ఆంధ్రప్రభ : ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం మర్కల్ గ్రామంలోని అశోక్ గార్డెన్‌లో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్రహ్మాజీవాడి గ్రామ కాంగ్రెస్ నాయకులు రక్తదానం చేసి సామాజిక సేవలో భాగస్వాములయ్యారు. ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయంగా రక్తదానం చేసినట్లు తెలిపారు.
నాయకుడి పుట్టినరోజును కేవలం ఆడంబరంగా కాకుండా, ఆసుపత్రుల్లో రక్తం లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద రోగులకు ఉపయోగపడేలా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
సమాజానికి ఉపయోగపడే ఈ సేవా కార్యక్రమంలో బ్రహ్మాజీవాడి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తాము మనస్ఫూర్తిగా పాల్గొని రక్తదానం చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీవాడి నాయకులు గడ్డం రాజు, బలవంతరావు, రమేశ్‌రావు, రాజేందర్‌రావు, శివాజీరావు తదితరులు పాల్గొన్నారు.
