NZB | రేవంత్ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి.. ఎంపీ అరవింద్

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 1:(ఆంధ్రప్రభ): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అని ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు భూములు అమ్మాలి.. కమిషన్లు మింగాలనీ ఉంటుందన్నారు. కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై సీఎంకు లేకపాయేనని ఎద్దేవా చేశారు. హెచ్ సి యూ భూముల జోలికి రావొద్దని, యూనివర్సిటీ భూములు అమ్మనివ్వమని, కొననివ్వమని ఎంపీ చెప్పారు. సీఎంకు రియల్ ఎస్టేట్ తప్ప, ఏదీ చేతకాదని అడ్మినిస్ట్రేషన్ పై, నాలెడ్జిపై కనీస అవగాహన కూడా లేదని మండిపడ్డారు.

మంగళవారం హైదరాబాదులో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెలతో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ… రేవంత్ జేసీబీలు ఓల్డ్ సిటీలో నడవవు కానీ.. సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద నడపడానికి మాత్రం సిద్ధమమయ్యవా అని సీఎం రేవంత్ ను ఎంపీ ప్రశ్నించారు. హెచ్ సీ యూ భూములను విక్రయించడం ద్వారా వచ్చే రూ.40వేల కోట్లలో నిజంగా రాహుల్ గాంధీకి కమీషన్ లేకపోతే వెంటనే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలని ఎంపీ రాహుల్ గాంధీకి సూచించారు.

ఈ 2,500 ఎకరాలలో సుమారు 700 పక్షులు ఉన్నాయన్నారు. జేసీబీలతో చెట్లను తొలగించే క్రమంలో జింకలు, నెమళ్లు మృత్యువాత పడుతున్నాయని వాపోయారు. జంతువుల, పక్షుల అర్థనాథాలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. అదేవిధంగా 2500 ఎకరాల్లో వర్సిటీ యూనివర్సిటీ భూమి నోటిఫై చేసి శాశ్వత బౌండరీ నిర్మించాలని డిమాండ్ చేశారు. హెచ్ సీ యూ భూముల జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *