ఆలేరు రెవెన్యూ డివిజన్ డిమాండ్‌తో బంద్
అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు
డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన నాయకులు
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బంద్ నిర్వహించారు.
బంద్ సందర్భంగా పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. స్థానిక బస్టాండ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిలపక్ష కమిటీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఆలేరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించి, ప్రభుత్వం తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ బంద్‌కు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, బీఎస్పీ, అంబేద్కర్ యువజన సంఘం, వ్యాపార, వాణిజ్య సంఘాలు మద్దతు ప్రకటించాయి.
