తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..
- 12 తులాల వెండి , రూ. 30 వేల నగదు అపహరణ
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని అనాజిపురం గ్రామంలో చోరీ జరిగిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన బాధితురాలు కొల్లు నర్సమ్మ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 2 న మంగళవారం నర్సమ్మ తన ఇంటికి తాళం వేసి హైదరాబాదులో ఉన్న తన కుమారుడు కొల్లు నర్సింగ్ వద్దకు వెళ్ళింది. శనివారం ఉదయం తిరిగి గ్రామానికి చేరుకొని ఇంటి వద్దకు రాగా మెయిన్ డోర్ తీసి ఉండడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూసింది.

బీరువా తెలిసి ఉండడంతో చోరీ జరిగిందని గ్రహించి,లబోదిబోమంటు అరవడంతో సమీప కాలని వాసులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సతీష్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. శుక్రవారం రాత్రి చోరీ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ చోరీ ఘటనలో బీరువాలో ఉన్న 12 తులాల వెండితోపాటు , రూ.30 వేల నగదు చోరీకి పాల్పడినట్లు నరసమ్మ తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ విలేకరులకు తెలిపారు.
