-ముసురుతో మూగబోయిన గీత పని

ఇబ్బంది పడుతున్న గీత కార్మికులు

టేకుమట్ల, ఆంధ్రప్రభ : గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో టేకుమట్ల మండలంలోని గీత కార్మికుల జీవనం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. నిరంతర ముసురు కారణంగా తాటి చెట్లను ఎక్కి గీత తీసే పనులు పూర్తిగా నిలిచిపోయాయి. చెట్లు తడిగా ఉండటంతో వాటిని ఎక్కడం ప్రమాదకరంగా మారిందని కార్మికులు తెలిపారు.
రోజువారీ గీత పనిపై ఆధారపడి జీవించే కుటుంబాలకు ప్రస్తుతం ఉపాధి లేక ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. వర్షాలు తగ్గి వాతావరణం అనుకూలిస్తేనే తిరిగి పనులు ప్రారంభించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో గీత కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం వర్షాల వల్ల ఉపాధి కోల్పోయిన గీత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించి, అవసరమైన సంక్షేమ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు


ఇబ్బంది పడుతునాo


గత రెండు మూడు రోజుల నుండి ముసురుతో తాడిచెట్లు ఎక్కకపోవడంతో తాటి చెట్ల రోజువారి గీత పోవడం వలన ఉపాధి కోల్పోయాము కాగా ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించి సంక్షేమ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం -నేరెళ్ల సదయ్య గౌడ్