అమరావతి ఛాంపియన్ అండర్-17 క్రీడలకు ఎంపిక..

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం పట్టణంలోని వివేకానంద ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు అమరావతి ఛాంపియన్ అండర్-17 జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై పాఠశాలకు మరోసారి గర్వకారణంగా నిలిచారు. వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఎంపికతో పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

వాలీబాల్ విభాగంలో కృష్ణశ్రీనాథ్, ఎన్. మణికంఠ, కబడ్డీ విభాగంలో సగ్గుర్తి వేణు, ధిల్లీ కార్తీక్, ఖో-ఖో విభాగంలో చెన్నమల్లు జయశంకర్, వేముల ఏడుకొండలు, చెస్ విభాగంలో ఆధురి అద్విక్ ప్రసూన్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.వి. శ్రీనివాసరావు, కరస్పాండెంట్ పీ. రాజారెడ్డి ఎంపికైన విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీకాంత్, బి. శివరామ్లను అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.