ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం
3వ డివిజన్లో డోర్-టు-డోర్ టీడీపీ కార్యక్రమం
పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్
పటమట, ఆంధ్రప్రభ: ఎన్నికలకు ముందు కూటమి పార్టీ నాయకులు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కరెన్సీనగర్ ఆంజనేయ స్వామి గుడి ఏరియాలో ‘డోర్-టు-డోర్’ టీడీపీ కార్యక్రమం గురువారం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరై ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్థి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో డోర్-టు-డోర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరుగుతోందని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఒక్కొక్క ఇంటి దగ్గర మూడు నిమిషాల సమయం కేటాయించి ప్రజలకు వివరిస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికే ఐదు పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
ఆడపిల్లలకు నెలకు రూ.1500 ఇచ్చే పథకం ప్రభుత్వం నిధులు సమీకరించుకుని త్వరలో అమలు చేస్తామన్నారు. ఈ విషయాలను కూడా ప్రజలకు అర్థం అయ్యేలా వివరిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని జిల్లాకు పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం ప్రయాణించే అవకాశం కల్పించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా రాష్ట్రం మొత్తం ప్రయాణిస్తున్నారని, ఇప్పటికే 97 కోట్ల టికెట్ల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా అందచేసినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హాయంలో చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల సంక్షేమ పథకాల అమలు కొంత కష్టంగా మారినా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లు సమర్థవంతంగా పాలన చేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన చెప్పారు. ప్రభుత్వం నిధులు సమీకరించుకుంటూ అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని చెప్పారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గద్దె రమేష్, తాడి బాబూరావు, యలమంచిలి పండు, దయాల శీరీషా గాంధీ, గుళ్లపల్లి నారాయణరావు, వి.కృష్ణప్రసాద్, గుత్తికొండ కృష్ణ మోహన్, బండి సాయి కొమలి,. గల్లా రవి రవి.శివలక్ష్మి, రాగాని సాయి, గుంజా ఏసు తదితరులు పాల్గొన్నారు.
