మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
చిట్యాల, ఆంధ్రప్రభ: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలువురు కుటుంబాల సభ్యులను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గురువారం పరామర్శించారు.
చిట్యాల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిలుముల రమణాచారి తండ్రి చిలుముల శేఖరయ్య, అలాగే ఆకుల మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, మండల యువజన అధ్యక్షుడు తౌటం నవీన్, టౌన్ అధ్యక్షుడు బుర్ర శ్రీధర్, సీనియర్ నాయకులు పాండ్రాల వీరస్వామి, ఆరెపల్లి సమ్మయ్య, మేడిపల్లి శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
