సంక్షేమ విజయాల కరపత్రాలు పోస్టర్లు ఆవిష్కరణ..
రాప్తాడు, ఆంధ్రప్రభ : రెండేళ్లలో నియోజకవర్గంలో రూ.220కోట్లతో రోడ్లు, రూ.100కోట్లతో గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందిస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. నియోజకవర్గంలో రెండేళ్ల అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధికి సంబంధించి ఒక ప్రచార నివేదికను సిద్ధం చేశారు.ఇందుకు సంబంధించిన కరపత్రాలు పోస్టర్లను ఎమ్మెల్యే సునీత తన క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
రూ.220కోట్లతో వివిధ పథకాల కింద రోడ్లు వంతెనలు1000 ఎకరాల్లో 300 మెగావాట్ల సామర్థ్యం గల రామగిరి సోలార్ ప్లాంట్ గొందిరెడ్డిపల్లి దాదులూరులో రూ.109కోట్ల పెట్టుబడితో 6వేల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ పార్క్ నసనకోట ఎంజేపీ పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ జీడిపల్లి రిజర్వాయర్ నుండి పరిటాల రవీంద్ర కాలువకు రూ.810కోట్ల కేటాయింపు, జల జీవన్ మిషన్ ద్వారా రూ.100కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీరు, జాకీస్థానంలో రూ.330కోట్లతో రేమాండ్స్ కంపెనీ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు.
మహిళా సంఘాలకు రూ.516 కోట్లు రుణాలు, 41,315మందికి 136కోట్లతో పింఛన్లు, 83917మంది పిల్లలకు రూ.110కోట్లతో తల్లికి వందనం,1167మందికి ఆటోడ్రైవర్లకు రూ.2.5కోట్లు, 727గోకులం షెడ్లు రూ.9.80కోట్లు, రూ.10.50కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, రూ.7కోట్లతో ఆరోగ్య కేంద్రాలు, రూ.4107కోట్లతో విద్యార్థులకు కిట్లు, రూ.17కోట్లతో పాఠశాలల అభివృద్ధి, రూ.36కోట్లతో సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, పాఠశాల భవనాల అభివృద్ధికి రూ.17కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఈ రెండేళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణుల పై ఉందన్నారు.ఈ 40రోజులు ప్రతి ఇంటికీ మనం వెళ్లాలి.చేసిన వాటి గురించి ప్రతి ఒక్కరికి వివరించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు ఇతర మండలాల టిడిపి నాయకులు పాల్గొన్నారు.
