మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం
మానవత్వం చాటుకున్న సర్పంచ్ యన్నం మల్లేష్
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ సభ్యుడు కొండూరి నవీన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ యన్నం మల్లేష్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.1 లక్షల ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.
మృతుడి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ.1 లక్షలను వారి పేరుపై డిపాజిట్ చేయించారు. అనంతరం నవీన్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
