మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మూర్తికి మాతృవియోగం…

ఏలూరు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ జోన్-2 అధ్యక్షుడు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జి.వి.ఎస్.ఎన్. మూర్తి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సావిత్రి సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు.

ఏలూరుకు చెందిన జి.వి.ఎస్.ఎన్. మూర్తి ప్రస్తుతం విజయవాడలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే ట్రాన్స్‌పోర్ట్ శాఖ జోన్-2 పరిధిలోని టెక్నికల్, నాన్-టెక్నికల్ అధికారులు, ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ట్రాన్స్‌పోర్ట్ శాఖ అధికారులు, ఉద్యోగులు, అసోసియేషన్ సభ్యులు జి.వి.ఎస్.ఎన్. మూర్తికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దివంగత సావిత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.