Collector | కలెక్టరేట్‌లో అనంత శ్రీరామ్..

Collector | కలెక్టరేట్‌లో అనంత శ్రీరామ్..
Collector | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో ఫిర్యాదు చేశారు. తన తండ్రితో కలిసి హాజరైన ఆయన.. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారని అధికారులకు వినతిపత్రం అందజేశారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో.. సంబంధిత స్థల వివాదం ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోందని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. అయినప్పటికీ తమపై ఒత్తిళ్లు, బెదిరింపులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
చెగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని అనంత శ్రీరామ్ ఆరోపించారు. తమ తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని, సమస్యపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
